Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి ఎస్సై గురు స్వామి

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి ఎస్సై గురు స్వామి

- Advertisement -

నవతెలంగాణ – తాడూర్
 రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే  హెల్మెంట్ సరిగా ధరించాలని  తాడూరు ఎస్సై గురుస్వామి, సర్పంచ్ సంద మల్లయ్య అన్నారు. సోమవారం తాడూరు మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని 16 మంది ఫోటోగ్రాఫర్లకు ఉచిత హెల్మెట్ల పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సై గురుస్వామి గ్రామ సర్పంచ్ సంద మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై హెల్మెంట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణం చేస్తుంటారు. హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని ప్రమాదం నుంచి బయటపడొచన్నారు. ఫోటోగ్రాఫర్ల రక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించిన తాడూరు మండల అధ్యక్షులు సూర్యపాకుల బాలు, సెక్రెటరీ నయీమ్, కోశాధికారి జక్క మల్లేష్ కు ప్రత్యేక అభినందనలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ రమేష్, జిల్లా అధ్యక్షుడు మిత్ర రాజు, తాలూకా అధ్యక్షులు శ్రీకాంత్, సెక్రెటరీ ఎత్తపుశివ, కోశాధికారి ఎండి సలాం, జిల్లా మాజీ  అధ్యక్షులు గంధం ప్రసాద్, జిల్లా మాజీ అధ్యక్షులు నేతాజీ గౌడు, మండల మాజీ అధ్యక్షులు జూలూరి శివ, మాజీ అధ్యక్షులు ఎండి షబీర్, ఎండి మహమ్మద్, రామ్ చందర్, కుర్మయ్య జి.బాలు, రవి, ఏ. బాలు, దశరథం రాజు, కృష్ణ , ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -