Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ నిందితుల అరెస్ట్…

 నిందితుల అరెస్ట్…

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : గత కొన్ని రోజులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులలో గల గుడులలో దొంగతనం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నిందితులను భువనగిరి రూరల్ పోలీస్ వారు అదుపులోకి తీసుకోని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి  పంపించినట్లు తెలిపారు. భువనగిరి  డిఎస్పి బండారు రవీందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం 

సిద్దిపేట పట్టణానికి చెందిన  ఇద్దరు  బోదాసు యాదగిరి, కోమిరే శ్రీను లు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ప్రతి రోజు రాత్రి సమయంలో గ్రామ శివారులలోని ఊరిదేవాలయాలలో ఉన్న వస్తువులను దొంగిలిస్తూ, సుమారు 5 గుడులలో దొంగతనం చేసి, దొరకకుండా తిరుగుతుండగా, రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది సిసి టీవీ ఫుటేజ్  లను పరిశీలిస్తూ, వారిపై నిఘా ఉంచి, సోమవారం  నిదితులను అదుపులోకి తీసుకోని, వారి నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని,

తదుపరి రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ చంద్రబాబు ఎస్ఐ అనిల్ కుమార్, ఎస్సై 2 శివ శంకర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -