- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : లిబియా తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ దేశాల వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 53 మంది మృతి చెందారు. ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు UN మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. లిబియాలోని జావియా సిటీ నుంచి బయలుదేరిన 6 గంటలకు బోటు మునిగిపోయినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే మధ్యదరా సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించి దాదాపు 500 మంది చనిపోయినట్లు పేర్కొంది.
- Advertisement -



