- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర సోమవారం తిరుపతి చేరింది. టీడీపీ నాయకులు, పార్టీ అభిమానులు స్వాగతం పలికారు. జనవరి 19న హైదరాబాద్ సమీప షాద్‌నగర్‌లో యాత్ర ప్రారంభించానని, 507 కి.మీ. నడుస్తూ తిరుపతి చేరుకున్నట్లు ఈ సందర్భంగా గణేష్ చెప్పారు. మంగళవారం అలిపిరి నుంచి తిరుమల చేరుకుని మొక్కులు తీర్చుకుంటానని వెల్లడించారు.
- Advertisement -



