Wednesday, February 11, 2026
E-PAPER
Homeబీజినెస్చేతులు కలిపిన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మరియు ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్.

చేతులు కలిపిన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మరియు ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్.

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా కంపెనీలలో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, కేరళలోని తిరువనంతపురంలో ప్రధాన కార్యాలయం కలిగిన ముత్తూట్ పప్పచన్ గ్రూప్ (ముత్తూట్ బ్లూ) యొక్క ప్రధాన సంస్థ అయిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది.

ఈ భాగస్వామ్యం ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ యొక్క కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ యొక్క సమగ్రమైన గ్రూప్ మరియు వ్యక్తిగత జీవిత బీమా పరిష్కారాలను సులభంగా పొందటానికి వీలు కల్పిస్తుంది. ఇందులో తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి అనువైన రక్షణ, దీర్ఘకాలిక పొదుపు ఉత్పత్తులు సైతం ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ యొక్క 3750+ శాఖల విస్తృత నెట్‌వర్క్, దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించబడతాయి.

ఈ భాగస్వామ్యం గురించి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ విభా పడాల్కర్ మాట్లాడుతూ, “ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో మా భాగస్వామ్యం ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే పరిశ్రమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ యొక్క ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లకు, ప్రభావవంతమైన జీవిత బీమా పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇది వారి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా , మా సౌకర్యవంతమైన ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ యొక్క టచ్‌పాయింట్‌లలోని బృందాలు తమకు , వారి కస్టమర్‌లకు ఆనందదాయకమైన అనుభవాన్ని అందించడానికి డిజిటల్‌గా సాధికారత పొందేలా చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, దేశంలో జీవిత బీమా పరిధిని విస్తరించడానికి , ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సిఇఒ శ్రీ షాజీ వర్గీస్ మాట్లాడుతూ, “మేము హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌తో చేతులు కలపడం ఆనందంగా ఉంది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ రెండూ విస్తృత స్థాయి కస్టమర్ నమ్మకంపై నిర్మించబడ్డాయి. ఈ భాగస్వామ్యం 3,750+ శాఖల పరిధి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మిలియన్ల మంది కస్టమర్‌లతో మా సంబంధాల విస్తృతి , హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ యొక్క ఉత్పత్తి, రిస్క్ నైపుణ్యాన్ని కలిపి భారతీయ కుటుంబాలకు అర్థవంతమైన రక్షణను సృష్టించడం చేస్తుంది ” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -