మాంద్యం ముంచుకు రావొచ్చు
– ద్రవ్యోల్బణం ఎగిసిపడే ప్రమాదం : ట్రంప్ విధానాలపై యూఎస్ ఫెడ్ చైర్మెన్ ఆగ్రహం
వాషింగ్టన్: ట్రంప్ వాణిజ్య విధానాలతో అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని స్వయంగా ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ హెడ్ జోరోమ్ పావెల్ పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంభిస్తోన్న అధిక టారిఫ్‌ల విధానంతో అమెరికాకు తీవ్ర ముప్పేనని అన్నారు. యూఎస్ ఫెడ్ చైర్మెన్ జోరోమ్ పావెల్ చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకూ ప్రకటించిన సుంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటి గురించి ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదన్నారు. సుంకాల పెంపునతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకోను ందని హెచ్చరించారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు తమ కేంద్ర బ్యాంక్‌ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై భారీ స్థాయిలో సుంకాలతో ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. దీనివల్ల యూఎస్‌లోని కంపెనీలు, పరిశ్రమలపై నా పెను ప్రభావం పడనుండటంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై స్వదేశంలో నూ పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో పావెల్ వ్యాఖ్యలకు మరింత విశేషం నెలకొంది. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టా న్ని కలిగించే ప్రమా దం ఉందని పావెల్ పేర్కొన్నారు. టారిఫ్‌లను ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అటు ఆర్థిక మాంద్యం కూడా మొదలవుతుందని విశ్లేషించారు. స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ఊగిసలాటకు లోనవుతాయన్నారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ట్రంప్ సుంకాలు ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై ఏప్రిల్ 2న ట్రంప్ అధిక సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత, అమెరికాలోనూ ఆందోళనలు చోటు చేసుకోవడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. చైనాపై మాత్రం భారీస్థాయిలో సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. రెండు అగ్రదేశాల మధ్య సుంకాల పోరు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నది.
టారిఫ్‌లతో అమెరికాకు ముప్పే..
- Advertisement -
RELATED ARTICLES