Thursday, February 12, 2026
E-PAPER
HomeNewsరాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ తీర్మానం

రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ తీర్మానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన వ్యాఖ్యలతో దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ నిషికాంత్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని దూబే కోరారు.

ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్డాడుతూ.. ‘నేను రాహుల్‌ సోరస్‌ సంస్థతో చేతులు కలిపి దేశాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ ఈరోజు లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. నేను ప్రతిపాదించిన తీర్మానంలో రాహుల్‌ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని అభ్యర్థించాను’ అని అన్నారు. కాగా, నిన్న రాహుల్‌గాంధీ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయిందని, భరతమాతను అమ్మేశారని వ్యాఖ్యానించారు. మరుసటి రోజే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి తీర్మానం ప్రవేశపెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -