Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత

తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఏ.వి. కాలేజీలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ మంథా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ వినయ్ కుమార్, తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్ కృష్ణ పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహితి పదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోందని అందులో నేను ఈ ఏడాది భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాహితి ఇప్పటి వరకు ఐదు లిటరరీ ఫెస్టులు నిర్వహించామని అన్నారు.

6వ లిటరరీ ఫెస్ట్ ను దశాబ్ది ఉత్సవాలుగా ఏ.వి. కళాశాల తెలుగు శాఖతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అనే అంశంపై కవితలు, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాహితీవేత్తలు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు హాజరు అవుతున్నారని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మాకు తోడ్పాటు నందిస్తూ ప్రోత్సహిస్తన్న శ్రీనివాస్ మంథాకు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సహకరిస్తున్న యూత్ ఐకాన్ వినయ్ కుమార్ కు కూడా మోహన్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -