– ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకని ఈనెల 31వ తేదీన వరంగల్ నగరానికి వస్తున్న మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికేందుకు కాటారం మండలంలోని ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు, మాదిగ సోదరులంతా తరలి రావాలని ఎమ్మార్పీఎస్ కాటారం మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ పిలుపునిచ్చారు.మంగళవారం కాటారం మండలకేంద్రంలో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జాతి ఔన్నత్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా 30 ఏళ్ల సుధీర్ఘ పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మంద కృష్ణకు పద్మశ్రీ అవార్డు ను ప్రకటించడం మాదిగ జాతిని తలెత్తుకునేలా చేసిందన్నారు. అదే విధంగా మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం యావత్తు మాదిగ జాతికే గౌరవంగా భావిస్తూ ప్రతి గడప నుండీ మాదిగా బిడ్డ తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీధర్,మంతెన కరుణాకర్, సంతోష్ పాల్గొన్నారు.
వరంగల్ ర్యాలీకి మాదిగలంతా తరలి రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES