Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాన్సవాడ పురలో హస్తం జోరు..చైర్మన్ రేస్ లో కాసుల విజయ బాలరాజ్ 

బాన్సవాడ పురలో హస్తం జోరు..చైర్మన్ రేస్ లో కాసుల విజయ బాలరాజ్ 

- Advertisement -

నవతెలంగాణ-బాన్సువాడ (నసురుల్లాబాద్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను 11 వార్డులు గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పదవిని కైవాసం చేసుకుంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 190వార్డులకు గాను ఏకంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం 3 స్థానానికే పరిమితమైంది. ఇందులో బిజెపికి మూడు స్థానాలు, ఒక స్థానంలో ఎం ఐ ఎం పార్టీ ఒక స్థానంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.
ఇందులో  వాటిలవారీగా విజయం పొందిన వారి పేర్లు
1వ వార్డ్ బీఆర్ఎస్  నసీన్ బేగం, విజయం
2వ, కాంగ్రెస్ (జంగం రాజశేఖర్ ) విజయం
3వ..  కాంగ్రెస్ పార్టీ హకీమ్ విజయం
4వ..  కాంగ్రెస్ (రుక్మిణి) విజయం
5వ, కాంగ్రెస్( కాసుల విజయ)
6వ.బీఆర్ఎస్ (అంజుమన్ బేగం) విజయం
7వ.. బిజెపి  మానస శ్రీకాంత్ విజయం
8వ.. కాంగ్రెస్ శ్యామల వెంకట్ విజయం
9వ.. బీజేపీ పాశం ఆమని భాస్కర్ విజయం
10వ.. కాంగ్రెస్ (నగేష్  విజయం
11వ.. కాంగ్రెస్ లింగమేశ్వర్. విజయం
12వ.. ఇండిపెండెంట్ అభ్యర్థి అంజా గౌడ్ విజయం
13వ.. కాంగ్రెస్  కాలేక్  విజయం
14వ..కాంగ్రెస్ వసంత విజయం
15వ..  కాంగ్రెస్ వంకరి రమేష్ విజయం
16వ.. బీజేపీ గజ్జల మహేష్ విజయం
17వ. ఏంఐఎం ఫార్విన్ బేగం విజయం
18వ.. కాంగ్రెస్ రేష్మ బేగం విజయం
19వ బీఆర్ఎస్  మక్బుల్  విజయం సాధించారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీ 11,బిఆర్ఎస్ 3, బిజెపి 3
ఏంఐఎం 1, ఇండిపెండెంట్ 1, వివిధ పార్టీల వారు గెలుపొందిన అభ్యర్థులు ఆనందోస్తాలలలో ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక ఛానల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్ పదవి లో కాసుల విజయ బాలరాజ్ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ పార్టీ గెలుపొందిన వార్డు సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -