Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన జనసేన..

మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన జనసేన..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి స‌రికొప్పుల నాగేశ్వ‌ర‌రావు సమీప ప్రత్యర్థిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయం జనసేన శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది.

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపుకు కీలకంగా నిలిచింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేరేడుచర్లలో జనసేన కార్యకర్తల్లో ఇప్పుడు కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. మొత్తం 200కు పైగా స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు ఈ మొదటి గెలుపు మంచి ఊపునిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -