నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా టీం ఘోర పరాజయం చవిచూసింది. జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే..20 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బెన్నెట్(64) అర్థ సెంచరీతో చెలరేగగా, మారుమాణి(35) , ఆర్పీ బూరీ(35), సికందర్ రాజా(25) సముచిత ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లు స్టోనిస్, గ్రీన్ చోరో వికెట్ తీశారు. చేదనకు దిగిన ఆసీస్ టీం 19.3 బంతులకే 146 రన్స్ చేసి ఆసీస్ ఆలౌటైంది. గ్రూప్ బీలోని జింబాబ్వే పాయింట్ పట్టికలో రెండో స్థానంలోకి చేరుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ జింబాబ్వే అద్భుత విజయాలు నమోదు చేసింది. ఆస్ట్రేలియా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
అయితే.. ఛేదనకు దిగిన ఆసీస్ బ్యాటర్లకు జింబాబ్వే బౌలర్లు చుక్కులు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో నాలుగు ఓవర్లోనే ఆసిస్ టాపార్డర్‌ను జింబాబ్వే బౌలర్లు ఔట్ చేశారు. అందులో ఇద్దరు బ్యాటర్లను డకౌట్ గా పెవిలియన్ పంపారు.గ్రీన్, డేవిడ్ డకౌట్ కాగా, ఇంగ్లీస్ (8), టీమ్ హెడ్ (17) స్వల్ప పరుగులకే ఔట్ కావడంతో.. 29-4తో ఆస్ట్రేలియా పీకల్లోత్తు కష్టాల్లో పడిపోయింది. చివరలో 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన తరుణంలో ఆసీస్ బ్యాటర్లు తీవ్ర ఒత్తడికి గురైయ్యారు. మాక్స్ వేల్(31), రెన్‌షా (65) క్రీజులో ఉండి ఆశలు పెంచారు. కానీ క్రమంగా మ్యాచ్ జింబాబ్వే చేతిలోకి వెళ్లిపోయింది. వాళ్లందరు ఔట్ కావడంతో మిగతా బ్యాటర్లు 19.3 బంతులకే 146 రన్స్ చేసి ఆసీస్ ఆలౌటైంది. ముజారాబాణీ 4, ఈవేన్స్ 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. మసకందజ, ఆర్పీ బూరీ చోరో వికెట్ తీశారు.



