నవతెలంగాణ – హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దనరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరులో ఆయనపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, అక్కడి పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు. గాలి జనార్దనరెడ్డి ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో కొంతకాలంగా చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు అధికారులను సంప్రదించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దనరెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు.
గాలి జనార్దనరెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES