Thursday, May 29, 2025
Homeసినిమామాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

పూరి జగన్నాథ్‌, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందనున్న పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. ఇది పూర్తి స్థాయి మాస్‌, కమర్షియల్‌ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. పూరి సిగేచర్‌ స్టైల్‌, విజరు సేతుపతి మాగెటిక్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బ్లెండ్‌ చేసే ప్రత్యేకమైన కథాంశంతో ఈ సినిమా విభిన్నంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. మొత్తం కాస్ట్‌ అండ్‌ క్రూ ఇప్పటికే ఖరారు కావడంతో టీం ప్రస్తుతం హైదరాబాద్‌, చెన్నై అంతటా లొకేషన్స్‌ కోసం రెక్కీ చేస్తున్నారు. జూన్‌ చివరి వారంలో షూటింగ్‌ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్‌ ఒక ముఖ్యమైన కొలాబరేషన్‌ని సూచిస్తోంది. పూరి జగన్నాథ్‌ క్రియేటివ్‌, టెక్నికల్‌ అంశాలన్నింటిలోనూ చాలా కేర్‌ తీసుకుంటున్నారు. విజరు సేతుపతి, ఇతర ప్రధాన నటుల మొదటి షెడ్యూల్‌ నుంచే షూటింగ్‌లో పాల్గొనున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో విజరు సేతుపతి నెవర్‌ బిఫోర్‌ క్యారెక్టర్‌ కనిపించబోతున్నారు. నటి టబు, విజరు కుమార్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -