- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
- Advertisement -



