సర్పంచ్ శంకర్ ముదిరాజ్
నవతెలంగాణ – మిడ్జిల్
పేద ప్రజల ఆరోగ్యమే, ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని సర్పంచ్ శంకర్ ముదిరాజ్ అన్నారు. మండల కేంద్రంలోనీ మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య స్వగ్రాంలో మండల కేంద్రానికి చెందిన శివలీల అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చులకోసం ముఖ్యమంత్రి సహాయనిధి రూ.27 వేల చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లికార్జున రెడ్డి, వెంకటయ్యతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పేద ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న ప్రభుత్వము డబ్బులు ఇస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వము సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. ప్రజలు కూడా ప్రజా ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, వార్డు మెంబర్లు రమేష్, వెంకటయ్య, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు పసుల శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



