Sunday, February 22, 2026
E-PAPER
Homeజిల్లాలుఘనంగా మాతృభాష దినోత్సవం.!

ఘనంగా మాతృభాష దినోత్సవం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హహైస్కుల్లో శనివారం మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య ప్రధానోపాధ్యాయులు బి.తిరుపతి మాట్లాడుతూ.. తెలుగు భాష అమ్మలాంటిదని ఆ భాషను కాపాడుకుంటేనే మన మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. అలాగే తెలుగు ఉపాధ్యాయుడు సిహెచ్ శర్మ మాట్లాడుతూ.. మన భాషను పరిరక్షించుకుంటేనే మన సంస్కృతి సంప్రదాయాలు నిలుస్తాయని తెలిపారు. మన నాగరికత నిలుస్తుందని అందుకోసం మాతృభాషను కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పి.మానస, ఎండి యాకూబ్ పాషా, ఐత మహేందర్, సుజాత, గోపీనాయక్, చంద్ర ప్రకాష్, రవీందర్, ఓఎస్ సందీప్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -