Sunday, February 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసిగ్న‌ల్ వ‌ద్ద ఫ్రీ లెప్ట్ బ్లాక్.. 9వేల వాహ‌నాదారుల‌పై కేసులు న‌మోదు

సిగ్న‌ల్ వ‌ద్ద ఫ్రీ లెప్ట్ బ్లాక్.. 9వేల వాహ‌నాదారుల‌పై కేసులు న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ నిబంధ‌న‌లను ఉల్లంఘించిన వాహ‌నాదారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.సిగ్న‌ల్ ద‌గ్గ‌ర‌, ఆయా చౌర‌స్తాల వ‌ద్ద ఫ్రీ లెప్ట్‌ను బ్లాక్ చేసి భారీ ట్రాఫిక్ జాంకు కార‌ణ‌మవుతున్న‌ వాహ‌నాదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించారు. 12 రోజుల్లో ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన మొత్తం 9,142మందిపై కేసు న‌మోదు చేశారు. ఈ త‌ర‌హా రూల్స్ అతిక్ర‌మించిన వారిపై సోష‌ల్ మీడియా ద్వారా ఫేస్‌బుక్, ఎక్స్ లేదా 9010203626,8712661690 నెంబ‌ర్ల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -