- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై శ్రీశైలం దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



