- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్ జీ లొంగిపోయారు. ఆదివారం తెలంగాణ ఎస్ ఐ బీ ముందు దేవ్ జీ తో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అదే విధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి కూడా లొంగిపోవడం గమనార్హం. ఆదివారం జరిగిన లొంగుబుకు సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిష్టు అగ్రనేతలను ఎన్ కౌంటర్ పేరుతో అణచివేస్తోంది. అనేక మంది మావోయిష్టు అగ్రనాయకులు ఆపరేషన్ కగార్ లో అమరులైయ్యారు. మరికొంతమంది పోలీసుల ముందు లొంగిపోతున్నారు.
- Advertisement -



