Sunday, February 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీ చోరీ.. 35 తులాల బంగారం అపహరణ

భారీ చోరీ.. 35 తులాల బంగారం అపహరణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి కుటుంబం శనివారం పెనికలపాడులోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు.. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు.

ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. బీరువాలో భద్రపరిచిన బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు వారు సమాచారం అందించారు. సీఐ కొండారెడ్డి, ఎస్సై సంజీవరెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇంట్లోని వేలిముద్రలతో పాటు పలు ఆధారాలను క్లూస్‌టీమ్‌ సేకరించింది. ఈ చోరీ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -