ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు ఫైల్ చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అన్నం పట్ల కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసుబిడ్డను అత్యంత దారుణంగా కాలితో తన్ని హత్య చేసిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అన్నం పట్ల కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అన్నం పట్ల కృష్ణ మాట్లాడుతూ .. కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత దారుణంగా కాలితో తన్ని హత్య చేసిన అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్య నేరం కింద కేసు నమోదు చేయాలన్నారు.
79 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో నేటికీ దళిత, గిరిజన, మైనార్టీ బడుగు బలహీన వర్గాల మీద దాడులు హత్యలు, అత్యాచారాలు సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. పండుగలు, ఉత్సవాలలో కులవ్యక్ష అగ్రకుల దురహంకారంతో ప్రజల మధ్య విద్వేషం సృష్టించి దేవుని దగ్గర అందరం సమానం కాదని ఈ సంఘటన నిరూపిస్తుందన్నారు. ఈ ఘటనలో బాధితులపై కేసు పెట్టి బాధ్యులను అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటున్నారు. పోలీసులు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దుండగులపై అత్యా నేరం కింద 103 సెక్షన్ పెట్టి దుండగులను అరెస్టు చేయాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ జిల్లా నాయకులు బర్రె సుదర్శన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, కెవిపిఏ జిల్లా కమిటీ సభ్యులు పల్లె పాటి మా అత్తయ్య, ఎస్సీ ఎస్టీ రిటైర్డ్ ఉద్యోగాల సంఘం జిల్లా నాయకులు నల్ల కృష్ణ, సామాజిక సంఘాల నాయకులు బొల్లెపల్లి అశోక్, కొండమడుగు రవి, అంబేద్కర్ సంఘం యువజన నాయకులు అన్న పట్ల రమణ, దుబ్బ ప్రదీప్, గౌలి కర్ విశాల్ పాల్గొన్నారు.



