Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుTG EDCET ప‌రీక్ష షెడ్యూల్ విడుదల‌

TG EDCET ప‌రీక్ష షెడ్యూల్ విడుదల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EDCET) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.తెలంగాణ ఎడ్‌సెట్‌-2026కు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ గడువులో అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.షెడ్యూల్ ప్రకారం రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. TG EDCET 2026 ప్రవేశ పరీక్ష మే 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.మే 30వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఎడ్‌సెట్ 2026 చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (VC), ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -