- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పేరు మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని భాషల్లో రాష్ట్రం పేరును కేరళ నుంచి ‘‘కేరళం’’గా మార్చాలని కోరుతూ 2024లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మలయాళంలో రాష్ట్రాన్ని కేరళంగా పిలుస్తారని.. మలయాళం ప్రజలు అదే పేరు పెట్టాలని కోరుకుంటున్నారని విజయన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో కేరళ పేరును మార్చేందుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
- Advertisement -



