నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా ఈరోజు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రెండు రోజులలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రాచకొండ, భువనగిరి ఫోర్ట్, మహదేవ్ పూర్, యాదాద్రి టెంపుల్, కొలనుపాక, మత్స్యగిరి టెంపుల్ , ఇంకా ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రణాళిక లు ఎం/ ఎస్ వయాన్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో టూరిజం అధికారి ధనంజనేయులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఓంప్రకాష్ టూరిజం రామ మూర్తి , మున్సిపల్ కమిషనర్ పోచంపల్లి యాదగిరిగుట్ట భువనగిరి పాల్గొన్నారు.
టూరిజం మాస్టర్ ప్లాన్ పై సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



