- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంకలోని పల్లెకెలెలో కాసేపట్లో సూపర్-8 దశలో పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈరోజు మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌కు అర్హత సాధించే పరిస్థితి. పల్లెకెలెలో వాతావరణం అనుకూలంగా ఉన్నా, 13 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ జట్టుకు ఈ మైదానంలో మంచి అనుభవం ఉంది. నెమ్మదిగా ఉండే పిచ్‌ను ఉపయోగించుకుని పాకిస్థాన్ స్పిన్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌కు సవాల్ విసరాలని చూస్తోంది. ఇది పాకిస్థాన్‌కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్.
- Advertisement -



