Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ సీఎం పినరయి విజయన్‌ను ఇంటర్వ్యూ చేసిన మోహన్‌లాల్

కేరళ సీఎం పినరయి విజయన్‌ను ఇంటర్వ్యూ చేసిన మోహన్‌లాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సాధారణంగా సినీ ప్రముఖులను జర్నలిస్టులు, రాజకీయ నేతలు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ, కేరళలో దీనికి భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మలయాళ సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్‌లాల్… ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటివరకు అనేక ఇంటర్వ్యూలలో ప్రశ్నలను ఎదుర్కొన్న మోహన్‌లాల్, ఈసారి ప్రశ్నలు అడిగే పాత్రను పోషించడం ఆసక్తి కలిగిస్తోంది. సీఎం అధికారిక నివాసమైన క్లిఫ్ హౌజ్‌లో ఈ ప్రత్యేక ముఖాముఖి జరిగింది.

ఈ ప్రాజెక్ట్ కోసం మోహన్‌లాల్ రెండు రోజులు తిరువనంతపురంలో గడిపినట్లు సమాచారం. ఒక రోజు చర్చలు జరిపి, మరుసటి రోజు ఇంటర్వ్యూను చిత్రీకరించారు. ఇందులో ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ పాలన వంటి అంశాలపై మోహన్‌లాల్ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ టీజర్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో ప్రముఖ ఛానెళ్లలో ప్రసారం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -