- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బ్రెజిల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మినాస్ గెరైస్ రాష్ట్రంలో నది ఉప్పొంగి పలు ప్రాంతాలను ముంచెత్తింది. జుయిజ్ డిఫోరా, ఉబా పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి 30 మంది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు 200 మందికి పైగా ప్రజలను కాపాడాయి. నిర్వాసితులకు సాయం అందించడానికి శ్రమిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా పేర్కొన్నారు.
- Advertisement -



