- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తొలిసారి IVF చికిత్స పద్ధతిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇవాళ వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. కాగా ఐవీఎఫ్ పద్ధతిలో గాంధీ ఆసుపత్రిలో బిడ్డ జన్మించడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -



