Wednesday, February 25, 2026
E-PAPER
Homeబీజినెస్హైద్రాబాద్‌లో ఆసుస్ ప్రత్యేకమైన స్టోర్‌ ప్రారంభం

హైద్రాబాద్‌లో ఆసుస్ ప్రత్యేకమైన స్టోర్‌ ప్రారంభం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశమంతటా తన బ్రాండ్ యొక్క రిటైల్ ముద్రను బలపరుచుకునే దిశగా, ఆసుస్ ఇండియా అనే, తైవానీస్ టెక్ దిగ్గజం నేడు హైద్రాబాద్‌లో దాని కొత్త ప్రత్యేకమైన స్టోర్ ప్రారంభాన్ని ప్రకటించింది. ఈ కొత్త ప్రత్యేకమైన స్టోర్ 350 చదరపు అడుగుల విస్తిర్ణంలో ఉన్నది మరియు విస్తారమైన ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్, వివోబుక్, జెన్‌బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమ్‌ర్స్ (ROG) ల్యాప్‌టాప్స్, గేమింగ్ డెస్క్‌టాప్స్, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్స్, మరియు ఉపకరణాల వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులతో సహా అందించబోతోంది. తెలంగాణా మరియు ఆంధ్రపేదేశ్‌లో ఇది బ్రాండ్ యొక్క 17డవ ప్రత్యేకమైన స్టోర్.

విస్తరణ గురించి మాట్లాడుతూ, జిగ్నేష్ బశవర్, జాతీయ సేల్స్ మేనేజర్ – పర్సనల్ కంప్యూటర్ మరియు గేమింగ్ బిజినెస్, ఆసుస్ ఇండియా, “ఇండియాలో మా రిటైల్ ముద్రను విస్తరణ ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. తెలంగాణా మాకు చాలా ముఖ్యమైన మార్కెట్‌గా ఉండగా, హైద్రాబాద్ నగరంలో కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభం దేశాంలోని వివిధ ప్రాంతాలంతటా వినియోగదారుల సాధికారతవైపుకి మా అసమానమైన అనుభవంలోని మా తాజా ఆవిష్కరణతో కీలక అడుగు వేయడానికి కారణమౌతుంది. ఒక వ్యూహాత్మక రిటైల్ విస్తరణతో, మా యుజర్స్‌కి మరింత ఇంటరాక్షన్ మరియు కొత్త టచ్‌పాయింట్స్‌ని సృష్టించడాన్ని మేము కొనసాగిస్తాము.” అని అన్నారు.

రిటైల్ స్టోర్ చిరునామా: ప్రత్యేక స్టోర్- ల్యప్‌టాప్ స్టోర్, షాప్ నెం. 27/4, బిజెపి కార్యాలయం ప్రక్కన, రిలయేన్స్ డిజిటలకి ఎదురుగా, మెట్రో స్థంభం నెం. 821, కూకట్‌పల్లి, హైద్రాబాద్, తెలంగాణా 500072.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -