నవతెలంగాణ-హైదరాబాద్: టెహ్రాన్ అమెరికాను ఢీకొట్టగల క్షిపణిలను అభివృద్ధి చేస్తోందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబుద్ధాలని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, జనవరిలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో చనిపోయిన వారి సంఖ్య గురించి వారు ఏమి ఆరోపిస్తున్నారో అదంతా కేవలం పచ్చి అబద్ధాలు. ఆ పెద్ద అబద్దాలనే పదే పదే పునరావృతం చేయడమే పని’ అని ట్రంప్నుద్దేశించి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖై ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ట్రంప్ ఇరాన్ క్షిపణులు అమెరికా గడ్డను తాకబోతున్నాయని, ఈ చర్యను ఎప్పటికీ అనుమతించనని అని ట్రంప్ తాజాగా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ఎస్మాయిల్ బకై ఎక్స్ పోస్టులో తీవ్రంగా ఆరోపించారు. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించడానికి తాను ఎప్పటికీ అనుమతించనని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



