- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.
- Advertisement -



