- రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్ డీల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. గత నెలలో పార్లమెంట్ సమావేశాల్లో సదురు డీల్ రద్దు చేయాలని కాంగ్రెస్, సీపీఐ(ఎం)లతో పాటు వివిధ పార్టీల ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం ఎదుట ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా యూఎస్ డీల్‌ను రద్దు చేయాలని, ట్రంప్ ఒత్తిడి మేరకు మోడీ రాజీపడ్డారని పెద్దయోత్తున నినాదాలు చేస్తూ అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు.
తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూఎస్ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బ్యానర్లు చేతబూని పీఎం మోడీ రాజీపడ్డారని నినాదాలతో హోరెత్తించారు. ఇండియన్ రైతులను మోసం చేస్తూ అమెరికాకు మోడీ సర్కార్ మేలు చేస్తోందని మండిపడ్డారు. రైతులకు ప్రతికూలమైన యూఎస్ డీల్‌ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.



