నవతెలంగాణ-హైదరాబాద్: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ విచారణ చేపడుతోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26న హాజరుకావాలని ఇటీవల ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో ఉదయం 10:30 గంటలకు ఆయన సెంట్రల్ ఢిల్లీలోని ఫెడరల్ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బుధవారం అనిల్‌కు చెందిన ముంబయి నివాసం ‘అబోడ్’ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ నివాసం విలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. తాజా వాటితో కలిపి ఈ కేసులో మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను తీసుకుని, మోసానికి పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. గతేడాది ఆగస్టులో అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
ఈడీ విచారణకు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ
- Advertisement -
- Advertisement -



