నవతెలంగాణ-హైదరాబాద్:టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అపజయం ఎరుగని వెస్ట్ండీస్ టీంపై సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో విజయం కైవసం చేసుకుని సూపర్-8 గ్రూప్-ఏ నుంచి సెమీ ఫైనల్ దూసుకెళ్లింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మార్కకరమ్(82) చెలరేగాడు. అర్ధ సెంచరీతో కదంతొక్కి చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టును విజయతీరాలకు చేర్చాడు. డీకాక్(47), రీక్లిన్ టన్(50) పరుగులతో కెప్టెన్‌కు తొడ్పాటు అందించారు. సూపర్-8 గ్రూప్-ఏ అగ్రస్థానంలో నిలబడి సెమీస్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకెళ్లింది. గ్రూప్-బీ నుంచి ఇంగ్లాండ్ టీం సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకొని, వెస్ట్ండీస్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వెస్టిండీస్ ఓపెనర్లు నుంచి ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఎస్డీ హోప్ (16), హిట్ మేయర్(2)లు రెండో ఓవర్లో రెండో బంతికి హోప్ ఔట్ కాగా, అదే ఓవర్లో ఐదో బాల్కి హిట్ మేయర్ పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్లో మూడో బంతికే బీఏ కింగ్(21) వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ చేజ్(2) కూడా ఆదే ఓవర్లో ఆఖరి బంతికి పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్కసారిగా వెస్ట్ండీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
సాఫారీ బౌలర్లు రబాడ(2), నింగిండి(3), బ్రోచ్(2) లైన్ అండ్ లెన్త్ బౌలింగ్‌తో పరుగుల కట్టడితో పాటు కీలక వికెట్లను పడగొట్టారు. అయితే ఈ కష్టకాలంలో క్రీజులోకి వచ్చిన హోల్డర్(49), సేఫార్డ్(51) ఆచితూచి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. వికెట్లు పడినా..రన్ రేట్ పడిపోకుండా స్ట్రక్ రోటెంట్ చేస్తూ భారీ స్కోర్‌కు బాటలు వేశారు. వీరు ఆటతో జట్టుకు 176 పరుగుల భారీ స్కోర్ లభించింది.
ఆ తర్వాత చేధనకు దిగిన సఫారీ టీంకు ఓపెనర్లు కెప్టెన్ మార్కకరమ్, డీకాక్ శుభారంభానిచ్చారు. కెప్టన్ అర్థ సెంచరీతో చెలరేగా, డీకాక్ 47 పరుగులతో పెవిలియన్ చేరాడు. రిక్లిల్ టన్ (45)తో కలిసి వెస్ట్ండీస్ నిర్దేశించిన 176 లక్ష్యాన్ని అలవోకగా చేధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు మార్కకరమ్. వెస్టిండీస్ బౌలర్ల వికెట్ల వేటలో డీలాపడిపోయారు. ఆర్ ఏల్ చేజ్ మాత్రమే ఏడో ఓవర్లో డీకాక్‌ను ఔట్ చేశాడు. మిగిలిన బౌలర్లు వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలం చెందారు.



