నవతెలంగాణ – అశ్వారావుపేట
నేషనల్ మీన్స్ – కమ్ – మెరిట్ స్కాలర్షిప్ కు మండలం నుండి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈఓ ప్రసాదరావు గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 2008 ప్రారంభమైన ప్రామీన్స్- కమ్ – మెరిట్ స్కాలర్షిప్ పథకం 8వ తరగతి చదువుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల (వార్షిక ఆదాయం ₹3.5 లక్షలు) నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తారని, విద్యార్థుల డ్రాపౌట్ రేట్లను నివారించడం,సెకండరీ స్థాయిలో (9 నుండి 12 తరగతులు) వారి విద్యను కొనసాగించడానికి వారిని ప్రోత్సహించడం దీని లక్ష్యం అని తెలిపారు.
ఈ పధకానికి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల లు అయిన అశ్వారావుపేట నుంచి ఆకుల వీరేన్ గంగాదుర్గ,బొల్లి మణి చందన రాజు,నారాయణపురం నుంచి వాసిరెడ్డి నికిత శ్రీ, అచ్యుతాపురం నుండి కొల్లు రవి క్రిష్ణ లు ఎంపికయ్యారని తెలిపారు. ఈ విద్యార్థులు కు ఎంఈఓ ప్రసాదరావు తో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి.హరిత,సింగపోగు వెంకటేశ్వరరావు,షాహినా బేగం, ఉపాధ్యాయుల అభినందనలు తెలిపారు.



