Friday, February 27, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్ లో నాలుగవ అవుట్‌లెట్ ప్రారంభించిన  “ది యెల్లో స్ట్రా”

హైదరాబాద్ లో నాలుగవ అవుట్‌లెట్ ప్రారంభించిన  “ది యెల్లో స్ట్రా”

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో ఆరోగ్యకర పానీయాలు మరియు తేలికపాటి ఆహారానికి ప్రసిద్ధిగాంచిన “ది యెల్లో స్ట్రా” బ్రాండ్ తమ నాలుగో అవుట్‌లెట్‌ను నాలెడ్జ్ సిటీ, శిల్పగ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, హైటెక్ సిటీలో ప్రారంభించింది. తాజాగా, ఆరోగ్యకరంగా, రుచికరంగా మరియు సులభంగా అందుబాటులో ఉండే ఆహారం అనే ప్రధాన సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్న ఈ బ్రాండ్, తాజా జ్యూస్‌లు, స్మూతీలు, స్మూతీ బౌల్స్, సలాడ్లు, సాండ్‌విచ్‌లు మరియు తేలికపాటి ఆహారాన్ని కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తరువాతే తాజాగా తయారు చేస్తుంది.

ఈ నాలుగవ ఔట్లెట్ ప్రారంభం హైదరాబాద్‌లోని కార్పొరేట్ మరియు కమ్యూనిటీ హబ్‌లలో బ్రాండ్ స్థిరపాటును మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో 100 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌ల విస్తరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుంది .

విక్రమ్ ఖిన్‌వాసరా మరియు పియూష్ కంకారియా స్థాపించిన “ది యెల్లో స్ట్రా”, ఆర్గనైజ్డ్ జ్యూస్ మరియు ఆరోగ్యకర ఆహార రంగంలో ఉన్న విశ్వసనీయత లోటును అధిగమించాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. పదార్థాల పారదర్శకత మరియు స్వచ్ఛమైన సోర్సింగ్‌పై దృష్టి సారించిన ఈ బ్రాండ్, నీరు కలపకపోవడం, ప్రిజర్వేటివ్‌లు మరియు రిఫైన్డ్ షుగర్ ఉపయోగించకపోవడం వంటి సిద్ధాంతాలతో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. హైదరాబాద్‌లో అత్యంత వేగవంతమైన పని మరియు జీవనశైలి ప్రాంతాలలో ఒకటైన నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్, కార్యాలయ ఉద్యోగులు, ఫిట్‌నెస్ ఆసక్తిగల వ్యక్తులు, విద్యార్థులు మరియు సందర్శకుల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఛాయస్ ను అందించే “గ్రాబ్-అండ్-గో “ వెల్‌నెస్ స్టాప్‌గా రూపుదిద్దుకుంది. ఈ ప్రారంభం, అధిక రద్దీ ఉన్న పట్టణ ప్రాంతాలలో ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే బ్రాండ్ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యకర ఆహారంలో విభిన్నత లేనిదనే భావనను సవాలు చేస్తూ, “ది యెల్లో స్ట్రా” మెనూ రుచి మరియు పోషక విలువల సమతుల్యలతో వుండే పదార్థాలు అందిస్తుంది. సహజ రుచి మరియు పోషక విలువలను నిలుపుకునే తాజా జ్యూస్‌లు, గ్రీక్ యోగర్ట్‌తో తయారయ్యే స్మూతీలు మరియు స్మూతీ బౌల్స్, సంపూర్ణ గోధుమ బ్రెడ్ సాండ్‌విచ్‌లు, పనీర్ మరియు ప్రత్యేక పదార్థాలతో తయారయ్యే ఫ్రూట్ సలాడ్లు, అలాగే హైడ్రేషన్ మరియు శక్తిని పెంపొందించే షేక్‌లు మరియు తేలికపాటి ఆహారం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా “ది యెల్లో స్ట్రా” సహ వ్యవస్థాపకులు పియూష్ కంకారియా మాట్లాడుతూ, “ప్రతిరోజూ ఆరోగ్యకర ఆహారాన్ని సులభంగా మరియు ఆనందదాయకంగా అందించడం మా లక్ష్యం. నాలెడ్జ్ సిటీ అవుట్‌లెట్‌తో హైదరాబాద్‌లో మా విస్తరణను మరింత బలోపేతం చేస్తూ, వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా తాజా మరియు శుభ్రమైన ఎంపికలను అందిస్తున్నాం” అని తెలిపారు. మరో సహ వ్యవస్థాపకులు విక్రమ్ ఖిన్‌వాసరా మాట్లాడుతూ, “ఈరోజుల్లో వినియోగదారులు తాము తీసుకునే ఆహారంలో పారదర్శకత మరియు నాణ్యతను ప్రాధాన్యంగా చూస్తున్నారు. పదార్థాల సమగ్రత మరియు ప్రత్యక్ష తయారీ విధానం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందగలుగుతున్నాం. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో విస్తరణ ద్వారా మరింత మందికి మా సేవలను చేరవేయాలనుకుంటున్నాం” అని పేర్కొన్నారు. నాలెడ్జ్ సిటీ, శిల్పగ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, హైటెక్ సిటీ, హైదరాబాద్‌లోని “ది యెల్లో స్ట్రా” తాజా అవుట్‌లెట్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంది. తాజా జ్యూస్‌లు, స్మూతీలు, స్మూతీ బౌల్స్, సలాడ్లు, సాండ్‌విచ్‌లు మరియు తేలికపాటి ఆహారంతో సంప్రదాయ ఫాస్ట్ ఫుడ్‌కు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా ఈ అవుట్‌లెట్ సేవలు అందిస్తోంది.

చిరునామా:
“ది యెల్లో స్ట్రా” , నాలెడ్జ్ సిటీ, శిల్పగ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ 500032

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -