నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తోంది. జూన్ మాసం నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లకు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తున్నారు.
తాజాగా, విడుదల చేసిన రూ.745 కోట్లతో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఉద్యోగుల బిల్లులతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. పంచాయతీల కోసం మరో రూ.389 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కావడంతో పాటు, ఉద్యోగుల ఆర్థిక అవసరాలు తీరనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.745 కోట్లు విడుదల
- Advertisement -
- Advertisement -



