నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాలపై ఎక్సైజ్ పోలీసుల అభియోగాలను ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ‘ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణణలోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలతో పాటు మరో 21మందిని కూడా విడుదల చేసింది. చార్జిషీట్‌లో ఆధారాలు లేని అనేక లోపాలు ఉన్నాయని ప్రత్యేక జడ్జి జితేంద్ర సింగ్ అన్నారు. ఇది 2021-22లో ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన మద్యం పాలసీ నాటి కేసు. కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో గతంలో ఉన్న మోడల్ కంటే చాలా ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొంది. అనంతరం ఢిల్లీ ప్రభుత్వం దానిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.



