Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంజెఎన్‌యు విద్యార్థి నేతల అరెస్ట్‌ .. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

జెఎన్‌యు విద్యార్థి నేతల అరెస్ట్‌ .. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జెఎన్‌యు నిరసనపై ఉక్కుపాదం మోపిన పోలీసులు విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపికాబాబు, మాజీ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి డానిష్‌ అలీ, ఇతరులను గురువారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వసంత్‌కుంజ్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్లు 132/3(5)(దాడి లేదా క్రిమినల్‌ ఫోర్స్‌), 221ప్ర్రజా ఉద్యోగిని అడ్డుకోవడం) మరియు 121(1) (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని అన్నారు. అదితి మిశ్రా, నితీష్‌ కుమార్‌ సహా మొత్తం 51మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, ఘర్షణ సమయంలో విద్యార్థులు భౌతిక దాడికి దిగారని, తమ సిబ్బందిలో చాలా మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

జెఎన్‌యుఎస్‌యు వెంటనే మరియు బేషరతుగా విడుదల చేయాలని, వైస్‌ ఛాన్సలర్‌ రాజీనామా చేయాలని, అంబేద్కర్‌ చిత్రపటాన్ని అవమానించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి కార్యకర్తలపై ప్రొక్టోరియల్‌ చర్యలు మరియు ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. జెఎన్‌యు ఉపాధ్యయ సంఘం (జెఎన్‌యుటిఎ) సైతం పోలీసు చర్యలను ఖండించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -