Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంఅభిమానుల‌తో వీరోష్‌ జంట ముచ్చ‌ట్లు

అభిమానుల‌తో వీరోష్‌ జంట ముచ్చ‌ట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌ముఖ న‌టిన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రష్మిక మందన్న గురువారం ఉదయపూర్ వేదిక‌గా ఒక‌టైన విష‌యం తెలిసిందే. ఇరు కుటుంబాల మ‌ధ్య అత్యంత వైభ‌వంగా ఇరువురు దాంప‌త్య జీవితంలోకి ప్ర‌వేశించారు. పెండ్లి అయిన త‌ర్వాత చూడ‌చ‌క్క‌ని జంట మొదటి సారి ప‌బ్లిక్ ముందుకు వ‌చ్చారు. శుక్రవారం ఉద‌య్‌పూర్ ఎయిర్ట్ పోర్టు ప్రాంగ‌ణంలో ఇరువురు త‌మ అభిమానుల‌ను ఉద్దేశించి ముచ్చటించారు. రష్మిక ఎరుపు రంగు దుస్తులు ధరించగా, దేవరకొండ సన్ గ్లాసెస్‌తో జతకట్టిన కుర్తా పైజామాను ధరించారు. దీంతో త‌మ ఆరాధ్య జంట‌ను చూసి అభిమానులు కేరింత‌ల‌తో అభివాదం తెలిపారు. వీరోష్‌ వీరోష్‌ అంటూ ఆనందంతో కేరింత‌లు కొట్టారు. త‌మ అభిమాన జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు. స్పందించిన కొత్త‌జంట‌.. ఫ్ల‌యింగ్ కిస్‌ల‌తో త‌మ అభిమానుల‌కు బ‌దులిచ్చారు. అదే విధంగా వ‌చ్చే నెల 4న హైద‌రాబాద్‌లోని తాజ్ కృష్ణ హోట‌ల్ లో రిసెప్షన్ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -