- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ నేత కవితలకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ పాలసీ కేసులో వారిని నిర్దోషులుగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ప్రకటించింది. సీబీఐ చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. వారితో పాటు మరో 21మందికి ఈ కేసులో క్లీన్చిట్ లభించింది. అయితే కేసు దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావించింది. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో తీర్పును సవాల్ చేయనుంది.
- Advertisement -



