నవతెలంగాణ-హైదరాబాద్: గతమెంతో ఘన చరిత్ర ఉన్నా..వర్తమానం అందుకు దక్కట్లుగా ఉంటుంది అనేదానికి గ్యారెంటీ ఏమి ఉండదు. అంతేకాకుండా ముందు మురిసినమ్మ పండగ ఏరగదని ఓ సామోత ఉంది. అందుకు తగ్గట్లుగానే టీ 20 ప్రపంచ కప్‌లో పలు దేశాల జట్ల ప్రదర్శన అందుకు మంచి ఉదాహరణ.
ఈ ఏడాది శ్రీలంక, ఇండియా దేశాల ఆతిథ్యంతో టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ అట్టహాసం ప్రారంభమైంది. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 20 టీంలు బరిలోకి దిగగా సూపర్-8 పోరుకు ఎనిమిది జట్లు దూసుకెళ్లాయి. రెండు గ్రూప్‌లుగా సదురు జట్లును విభజించి ప్రతి గ్రూపులో నాలుగు టీంలు ఉన్నాయి. ప్రతి జట్టు ఆయా గ్రూప్‌లోని టీంలతో మూడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు గ్రూప్‌లోని టాప్ టూ టీంలు సెమీస్‌కు దూసుకెళ్తాయి. ఈక్రమంలోనే పలు దేశాల జట్లు గ్రూప్ దశలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా టీంలు..సూపర్-8కు వచ్చేసరికి అథమ స్థానానికి పడిపోయాయి.
ముందుగా గ్రూప్-ఏలో ఆథిధ్య జట్టు భారత్ ఆడినా ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలువగా..ప్రస్తుతం సూపర్-8 దశలో సెమీస్ పోరుకు ఆమడ దూరంలో ఉన్నంది. మార్చి 1న వెస్ట్ండీస్‌తో జరిగే పోరుతో టీమిండియా సెమీస్ ఆశలపై క్లారిటీ రానుంది. ఇదే గ్రూప్‌లో ఇండియా చిరుకాల ప్రత్యర్థి పాకిస్థాన్ టీం రెండో స్థానంలో నిలిచింది. ఇండియా మీద తప్పా మిగిలిన మూడు మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. కానీ సూపర్-8 దశలో వర్షం కారణంగా భారీ దెబ్బ పడింది. కివీస్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయి..చెరో ఒక పాయింట్లతో సంతృప్తి చెందాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆ జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టంలో పడ్డాయి. నేడు జరిగే బ్రిటన్ వర్సెస్ కీవీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే..పాక్ సెమీస్ చేరనుంది. లేకపోతే ఇంటికి పోవాల్సిందే.
గ్రూప్-బిలో సంచలన విజయాలతో జింబాబ్వే అగ్రస్థానంలో నిలబడింది. అగ్రశ్రేణి టీంలైనా ఆస్ట్రేలియా, ఆతిథ్య జట్టు శ్రీలంకలను ఓడించి తన సత్తాను చాటింది. కానీ అదే జోరును సూపర్-8 పోరులో ప్రదర్శించలేకపోయింది. వెస్టిండీస్, భారత్ జట్ల చేతిలో ఘోర పరాజయం పొందింది. టోర్నీలో దక్షణాఫ్రికాతో నామామాత్రమైనా మ్యాచ్ ఆడి ఇంటికి పోనుంది. మరో ఆతిథ్య జట్టు శ్రీలంక పరిస్థితి మరీ దారుణం. టైటిల్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగి సూపర్-8లో ఆ జట్టు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయింది. ఆడినా ప్రతి మ్యాచ్‌లోనూ ఓటమి చెంది సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది.
గ్రూప్-సిలో వెస్టిండీస్ అగ్రస్థానంలో నిలబడి..సూపర్-8 దశలో కూడా అద్భుతమైనా ప్రదర్శన కనబర్చింది. సూపర్-8 గ్రూప్-ఏ నుంచి రెండో స్థానంలో ఉండి..టైటిల్ వేటకు సిద్ధంగా ఉంది. మార్చి 1న ఇండియాపై జరిగే కీలక పోరులో విజయం సాధించాల్సి ఉంది.
ఇక గ్రూప్ దశలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఇంగ్లాండ్..సూపర్-8 వచ్చేసరికి మిరాకిల్ చేసింది. సూపర్-8 పోరులో ఆడినా ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీలోనే ముందస్తుగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
గ్రూప్-డిలో మొదటి స్థానంలో ఉన్న సౌతాఫ్రికా..అదే జోరును కొనసాగించి సూపర్-8 గ్రూప్-ఏ నుంచి సెమీస్ కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్ కూడా అదే జోష్‌ను కనబర్బి సూపర్-8 గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచింది. నేడు ఇంగ్లాండ్‌పై జరిగే మ్యాచ్‌లో కీవీస్ విజయం సాధిస్తే..సెమీస్ వెళ్లడం దాదాపు ఖరారు కానుంది.



