నవతెలంగాణ-రామగిరి
పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కల్వచర్ల గ్రామంలో కుల వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల చిన్నారికి మృతికి నిరసనగా క్ వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొని చిన్నారి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు కన్నాల సంపత్, నాయకులు కంది శ్రీనివాస్, కంది శంకర్, మొండయ్య, కంది కిష్టయ్య, దండు సంపత్, రాజయ్య, దొడ్డిపేట కనకయ్య, సారయ్య, కంది రమేశ్,మహేష్, బీసీ సంఘం నాయకులు బూస కనకయ్య, రేండ్ల కుమారస్వామి,బూస అజయ్,ఎస్సీ నాయకులు బొంకూరి పోషం, ఆసం తిరుపతి, రాసమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కుల చిచ్చులో బలైన చిన్నారికి కొవ్వొత్తులతో నివాళులు
- Advertisement -
- Advertisement -



