-విచ్చలవిడిగా మార్కెట్లో లభ్యం
-పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు
వివాహాలు,శుభ కార్యాలయాలు,వనభోజనాలు,ఇలా ఏ వేడుక జరిగినా.. ఇప్పుడు రంగురంగుల కాగితపు ప్లేట్లు ప్రతీ చోట కనిపిస్తున్నాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం,వాడి పారేసే సౌలభ్యం ఉండటం,శుభ్రపరచాల్సిన అవసరం లేకపోవడం వంటి కారణాలతో ప్రజలు వీటి వినియోగానికి అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
రసాయనంతో అనారోగ్యం..
ప్రత్యేకంగా కాగితపు ప్లేట్లపై కనిపించే మెరిసే రంగులు, డిజైన్ల తయారీలో ‘బిస్పినోల్-ఏ’ వంటి హానికర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వేడి వేడి కూరలు, సాంబారు, పులుసు, బిర్యానీ వంటి ఆహార పదార్థాలను ప్లేట్లలో వడ్డించినప్పుడు, ఆ వేడి ప్రభావంతో కాగితంపై ఉన్న రసాయనాలు కరిగి ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. గ్యాస్, అజీర్తి, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణమవుతున్నాయి.దీర్ఘకాలంగా ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే కాలేయం (లివర్),మూత్రపిండాలు (కిడ్నీలు) పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
స్టీల్ పాత్రలు వాడాలి...
వినయ్ భాస్కర్ తాడిచెర్ల ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి.రంగుల తయారీలో వాడే ఇండస్ట్రియల్ పెయింట్స్, బిస్ఫినోల్ -ఏ వంటి కెమికల్స్ నేరుగా మన కడుపులోకి వెళ్తున్నాయి. దీనివల్ల మొదట గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలు కనిపిస్తాయి. లోపల ఇవి కాలేయం, మూత్ర పిండాలను మెల్లగా దెబ్బతీస్తాయి. చివరకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు స్టీల్ ప్లేట్లు లేదా మన పూర్వీకులు వాడిన విస్తరాకులనే వాడండి. అది మీకూ, పర్యావర ణానికీ కూడా శ్రేయస్కరం.
పేపర్ ప్లేట్లతో ప్రమాదం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



