Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కత్తల్ వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

కత్తల్ వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కత్తల్ వాడి జిపి గ్రామమలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజులైన ఇంటి నిర్మాణాలు జుక్కల్ ఎంపిఓ రాము,  గ్రామ సర్పంచ్ కేళిగే గోపాల్ రావ్ ఖండేరావు ముగ్గు వేసి నిర్మాణ పనులను  శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోపాల్ రావు , ఎంపిఓ రాము మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు గృహ నిర్మాణాలు చేపట్టుకోవాలి అన్నారు.

గ్రామంలో ఇల్లు లేని వారు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా మంజూరు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితగతిగా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. నిర్మాణాల బిల్లులను మూడు విడుతలుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘిస్తే బిల్లులు మంజూరు కావని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, గ్రామ సర్పంచ్, గ్రామ జిపి కార్యదర్శి , ,లబ్ధిదారులు , గ్రామ పెద్దలు , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -