నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడలో జరిగిన బాణసంచా తయారీ కర్మాగార ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాణసంచా తయారీదారుల కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రులను, ఉన్నతాధికారులను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత
వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతిపై సంతాపం తెలిపిన ఆమె, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరిన అనిత, జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కాకినాడ ప్రమాద ఘటన.. సీఎం చంద్రబాబు సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



