నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని చించోలి(బి), ధని , ఆలూరు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పదవ తరగతి విద్యార్థుల కోసం కాంప్లెక్స్ పరిధిలో ప్రత్యేకంగా ప్రేరణ అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోటివేషనల్ స్పీకర్ మునీందర్ రాజు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్, విద్యార్థులకు లక్ష్యసాధన, సమయ నిర్వహణ, పరీక్షా సిద్ధత, మానసిక ధైర్యం వంటి అంశాలపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. “పట్టుదల, ప్రణాళిక, ప్రతిరోజు పునశ్చరణే విజయానికి మార్గం” అని ఆయన పేర్కొన్నారు.
అనంతరం సబ్జెక్ట్ నిపుణులు ఉషాకిరణ్,శంకర్, రవిరాజు,మజీద్, మహేశ్వర్, వెంకట్రావు,సునీత, సంతోషీ మాత, వారి వారి సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, బిట్ పేపర్ విధానం, రివిజన్ టెక్నిక్స్, ఎక్కువ మార్కులు సాధించడానికి అవసరమైన సూచనలు వివరంగా తెలియజేశారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తేజపరిచే విధంగా సలహాలు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.



