- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శంకర్పల్లి రోడ్డులోని ‘రిషిత ఆటోమొబైల్స్’ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, గోదాంలోని హీరో హోండా స్పేర్ పార్ట్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
- Advertisement -



