- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో హింసకు పాల్పడుతున్న అఫ్గాన్ బలగాలపై దాడులు తీవ్రతరం చేసినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. ‘ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్’ పేరుతో ప్రతిదాడులు చేస్తూ 352 మంది అఫ్గాన్ తాలిబాన్లు, వారికి మద్దతుగా నిలిచిన టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు పాక్ సమాచార మంత్రి అతలుల్లా తరార్ శనివారం ఇస్లామాబాద్ లో వివరించారు. 500 మంది గాయపడినట్లు తెలిపారు. 104 మిలిటరీ పోస్టులు, 163 ట్యాంకులను ధ్వంసం చేశామని, 22 సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
- Advertisement -



